యాప్నగరం

సీతక్క టీడీపీని వీడటం వెనుక రేవంత్ భార్య!

తెలుగుదేశం పార్టీని వీడిన వరంగల్ నేతలు సీతక్క, వేం నరేందర్ రెడ్డిలు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. వేం నరేందర్ టీడీపీని వీడుతారని ముందుగానే అందరూ ఊహించిందే.

TNN 1 Nov 2017, 11:40 am
తెలుగుదేశం పార్టీని వీడిన వరంగల్ నేతలు సీతక్క, వేం నరేందర్ రెడ్డిలు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. వేం నరేందర్ టీడీపీని వీడుతారని ముందుగానే అందరూ ఊహించిందే. కానీ, సీతక్క కూడా పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని వెనుక పెద్ద హై డ్రామానే నడిచిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రేవంత్ రెడ్డి సతీమణి నేరుగా హన్మకొండకు వెళ్లి సీతక్కను కలిశారని, ఆమెకు అన్నీ వివరించి, కాంగ్రెస్‌లో చేరేలా ఒత్తిడి తీసుకొచ్చారని అంటున్నారు. దీంతో, రాత్రికి రాత్రే సీతక్క తన మనసు మార్చుకున్నారని, టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న సీతక్క... తెల్లవారుజామున ఢిల్లీకి బయలుదేరారు. అనంతరం రేవంత్ వర్గంతో కలసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సీతక్క నిర్ణయంతో టీడీపీ కార్యకర్తలు కూడా అవాక్కయ్యారని సమాచారం.
Samayam Telugu tdp leader seethakka influenced by revanth reddy wife to join congress
సీతక్క టీడీపీని వీడటం వెనుక రేవంత్ భార్య!


మరోవైపు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరిన నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చేలా ఉన్నాయి. త రేవంత్ భార్య సోమవారం రాత్రి సీతక్క ఇంటికి వెళ్లి బతిమాలి, ఆమె కాళ్లను పట్టుకున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీతక్క ఇమడలేరని, త్వరలోనే ఆమె ఆ పార్టీ నుంచి బయటకు వస్తారని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ లో చేరే విషయంపై తనతో సీతక్క మాట్లాడారని, కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించారని ఎర్రబెల్లి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.