యాప్నగరం

'కాపులకు అన్యాయం జరుగుతోంది.. కేంద్రంతో పోరాడాలి': టీడీపీ

కాపుల అండతో అధికారంలోకి వచ్చామని మర్చిపోకూడదు.. రిజర్వేషన్ల సాధించేందుకు కేంద్రంతో జగన్ పోరాడాలి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ కూడా సహకరిస్తుంది.

Samayam Telugu 28 Jul 2019, 6:04 pm
రిజర్వేషన్ల విషయంలో కాపులకు జగన్ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు. కాపులకు టీడీపీ ప్రభుత్వం కల్పించిన 5శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయడం దారుణమన్నారు మాజీ హోం మంత్రి చినరాజప్ప. కాపుల పోరాటాలను గుర్తించి గతంలో రిజర్వేషన్‌లు కల్పించామని.. వైసీపీ ప్రభుత్వం ఆ కోటాను తొలగించడం సరికాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. తగిన సమయంలో బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు.
Samayam Telugu jagan.


కాపులపై కోపంతో జగన్ రిజర్వేషన్లు సాధ్యం కాదని చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు. టీడీపీ సర్కార్ కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో రిజర్వేషన్లు కల్పించిందని.. జగన్‌ మాత్రం అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కాపుల అండతో అధికారంలోకి వచ్చామని జగన్ మర్చిపోకూడదన్నారు. కాపు రిజర్వేషన్‌‌లపై వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని.. టీడీపీ కూడా సహకరిస్తుందన్నారు. కాపులకు న్యాయం చేసేందుకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.

వ్యాపారాల్లో క్విడ్‌ ప్రోకో అలవాటైన జగన్.. రాజకీయాల్లో కూడా అదే పద్దతిని అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు నెహ్రు. ఆంధ్రప్రదేశ్ నీటిని.. ఇక్కడి ప్రజల డబ్బుతో తెలంగాణకు దోచిపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలా కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.