యాప్నగరం

ఎమ్మెల్సీ వాకాటిని సస్పెండ్ చేస్తున్నా: బాబు

నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ అధినేత

Samayam Telugu 13 May 2017, 6:59 pm
నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శనివారం అమెరికా నుంచి రాష్ట్రానికి చేరుకున్న ఆయన విదేశీ పర్యటన విశేషాలకు మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.
Samayam Telugu tdp mcl vakati narayana reddy suspended announces cbn
ఎమ్మెల్సీ వాకాటిని సస్పెండ్ చేస్తున్నా: బాబు


ఈ సందర్భంగా ప్రభుత్వం, పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు వాకాటిని సస్పెండ్ చేస్తున్నామని బాబు తెలిపారు. దర్యాప్తు నివేదికను బట్టి తదుపరి చర్యలుంటాయని ఆయన చెప్పారు.

ఆస్తుల విలువ ఎక్కువ చూపించి వాటినే హామీగా పెట్టి వివిధ బ్యాంకుల నుంచి భారీగా రుణం(రూ.190కోట్లు) తీసుకున్న వాకాటి.. రుణాన్ని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టారన్న ఫిర్యాదుపై శుక్రవారం సీబీఐ ఆయన ఆస్తులపై దాడులు నిర్వహించింది. ఈ మేరకు కేసు నమోదు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.