యాప్నగరం

పవన్ ఏమైనా ప్రభాస్‌లా ఆరడుగుల అందగాడా? ఊరికి ఎనిమిది మంది ఉంటారు: మంత్రి జవహర్

పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. చిరంజీవి సినిమా యాక్టర్ కాకపోతే పవన్ అనే వ్యక్తి ఎవరు? ఇదే చిరంజీవి కుటుంబంలో సుమారు 10 మంది యాక్టర్‌లు ఉన్నారు. వారిది సినీ వారసత్వం కాదా?

Samayam Telugu 24 Oct 2018, 12:40 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వారసత్వ రాజకీయాలపై మాట్లాడే అర్హత లేదంటూ ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి జవహర్. మంగళవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఏర్పాటు చేసిన గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో సహచర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి పాల్గొన్న ఆయన పవన్ కళ్యాణ్‌పై తీవ్రవ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu PAWAN


మంత్రి జవహర్‌ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గెడ్డం పెంచుకుంటే.. శాస్త్రవేత్త వేత్త అవుతాడని అనుకున్నా.. కాని ఆయనేదో పిచ్చిరాతలు రాసుకుంటూ ఉన్నారు. చదువు ఎక్కువైన వాళ్లు, మతిస్థిమితం లేనివాళ్లు ఇదేరకంగా రాతలు రాసుకుంటూ ఉంటారు. వీటితో పాటు పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. చిరంజీవి సినిమా యాక్టర్ కాకపోతే పవన్ అనే వ్యక్తి ఎవరు? ఇదే చిరంజీవి కుటుంబంలో సుమారు 10 మంది యాక్టర్‌లు ఉన్నారు. వారిది సినీ వారసత్వం కాదా?.

పవన్ కళ్యాణ్ సినీ వారసత్వం కాకుండా.. ఆరుడుగుల అందగాడని లేక ప్రభాస్‌లా ఆజానబాహుడని హీరో అయ్యాడా?. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లని లెక్కపెడితే ఊరికి 8 మంది ఉంటారు. వాళ్లు పవన్ కళ్యాణ్ కంటే చాలా అందంగా ఉంటారు. వాళ్లెవరికీ అవకాశం ఎందుకు రాలేదు అంటే.. వాళ్లు చిరంజీవి తమ్ముళ్లు కాదు.. అల్లు అరవింద్ బామ్మర్దులు కాదు కాబట్టి. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మితే.. తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ రిటైల్‌గా జనసేనను అమ్మడానికి సిద్ధమయ్యారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి జవహర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.