యాప్నగరం

అవిశ్వాసంపై చర్చ: జయదేవ్ నోట ‘భరత్’ మాట!

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సహా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించారు.

Samayam Telugu 20 Jul 2018, 1:17 pm
కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సహా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతి మేరకు తన ప్రసంగాన్ని ప్రారంభించిన జయదేవ్.. మొదటిగా తమకు సహకరించిన ప్రతిపక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తొలిసారి లోక్‌సభకు ఎంపీగా ఎంపికైన తానకు అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించే అవకాశం ఇచ్చిన స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. తొలిసారి ఎంపీగా ఎంపికైన ఎవరూ గతంలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించలేదని, ఇది తనకు దక్కిన గౌరమని అన్నారు.
Samayam Telugu Bharath


కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన వాగ్దానం గురించి చెబుతూ ‘భరత్ అనే నేను’ సినిమాను జయదేవ్ ప్రస్తావించారు. ‘లేటేస్ట్ తెలుగు బ్లాక్ బస్టర్ ‘భరత్ అనే నేను’ సినిమాలో ఒక యంగ్ ఎన్ఆర్ఐ సీఎం అవుతాడు. ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి చనిపోవడంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన భరత్.. యంగ్, డైనమిక్, ప్రియమైన సీఎంగా మారిపోతాడు. ఈ సినిమా థీమ్ విషయానికి వస్తే ‘నమ్మకం’. సినిమాలో భరత్‌కు తన తల్లి ఒక మాట చెబుతుంది. ఇచ్చిన మాట మీద నిలబడనివాడు మనిషే కాదని. ప్రజల మనోభావలను ఈ చిత్రంలో ప్రస్తావించడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది’ అని జయదేవ్ వివరించారు.

కానీ పార్లమెంటు సాక్షిగా విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని జయదేవ్ అన్నారు. పాత పేరుతోనే ఏర్పడిన కొత్త రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాలను మోదీ తుంగలో తొక్కారని జయదేవ్ మండిపడ్డారు. ఇది బీజేపీ, టీడీపీ మధ్య యుద్ధం కాదని, ఏపీ ప్రజల ధర్మ పోరాటమని అన్నారు. ఏపీ విషయంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ఏపీ ప్రజలను వచంనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని మోసగాడుగా జయదేవ్ అభివర్ణించారు. దీంతో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మోసగాడు పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.