యాప్నగరం

బాబు, కేసీఆర్‌ కలిస్తే కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయం: ఎంపీ మురళీమోహన్

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ కలయికపై సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 21 Aug 2018, 9:11 am
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయికపై సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు కలిస్తే దేశ రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందని, కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని ఎంపీ మురళీమోహన్‌ అభిప్రాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో సోమవారం పర్యటించిన ఆయన, స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ, టీఆర్‌ఎస్‌లు పొత్తు పెట్టుకోవాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. అలా కలిస్తే రెండు రాష్ట్రాల్లోని 42 పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ సీట్లను ఈ కూటమి గెలుచుకునే అవకాశం ఉందని... అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించవచ్చని పేర్కొన్నారు. కానీ, కేసీఆర్‌ మాత్రం బీజేపీకి దగ్గర కావాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోందని మురళీమోహన్ వ్యాఖ్యానించారు.
Samayam Telugu టీడీపీ-టీఆర్ఎస్ కలయిక


ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు సానుకూల వాతావరణం ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌కు అక్రమార్జనలో తప్ప పాలన అనుభవం లేదని, జనసేన అధినేత పవన్‌ మంచి వ్యక్తే అయినా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించే అనుభవం లేదని పేర్కొన్నారు. ఏపీలో తామ పార్టీ ఒంటరిగానే పోటీచేయడం ఖాయమని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో కేసీఆర్‌ ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.