యాప్నగరం

‘మోదీజీ.. వెంకన్న సాక్షిగా ప్రామిస్ చేశారు, కానీ’

బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ గుర్రుగా ఉంది. ముఖ్యంగా విభజన హామీల విషయం కేంద్రం వైఖరిపై మండిపడుతోంది.

TNN 5 Feb 2018, 12:51 pm
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో, విభజన చట్టంలో హామీల అమలుపై తాత్సారం చేయడంతో కేంద్రంపై మిత్రపక్షం టీడీపీ ఒకింత ఆగ్రహంతో ఉంది. దీంతో ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని టీడీపీ ఎంపీలకు అధినేత దిశానిర్దేశం చేశారు. సోమవారం ఉదయం ఎంపీలతో చంద్రబాబునాయడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటు సాక్షిగా నిలదీయాలని సూచించారు. ఇందులో భాగంగా ఉదయం లోక్‌సభ ప్రారంభమైన తర్వాత విభజన హామీల అమలుపై టీడీపీ స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నోటీస్ ఇచ్చింది. లోక్ సభలో రూల్ 193 ప్రకారం టీడీపీ నోటీస్ ఇచ్చామని ఎంపీ తోట నరసింహం తెలిపారు.
Samayam Telugu tdp mp shivaprasad intresting comments on pm modi
‘మోదీజీ.. వెంకన్న సాక్షిగా ప్రామిస్ చేశారు, కానీ’


మరోవైపు విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎంతగానో నష్టపోయిందని, నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యతగల కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆరోపించారు. పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడిన తరువాత తెలుగుదేశం ఎంపీలతో కలసి ఆయన గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియజేస్తూ... విభజన చట్టాన్ని అమలు చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబునాయుడి సహనానికి కూడా ఓ హద్దుంటుంది. అలుగుటయే ఎరుంగని చంద్రబాబు అలిగిన రోజు పరిస్థితులు విషమిస్తాయి. అంతదూరం తీసుకు రావద్దండీ. మోదీగారూ తిరుపతి వెంకన్న సాక్షిగా... మీరు అనేక వాగ్దానాలు చేశారు. ఒక్కటి కూడా నెరవేర్చలేదు... కాబట్టి దయచేసి తక్షణమే జోక్యంచేసుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తి పడే సమాధానం ఇవ్వండి. లేకపోతే వార్ విల్ బీ డిక్లేర్డ్" అని హెచ్చరించారు. ఈ ఆందోళనలో టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, టీజీ వెంకటేశ్, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.