యాప్నగరం

ఏపీకి ఏమీ ఇవ్వకపోయినా కేంద్ర బడ్జెట్ బాగుందట.. విజయసాయిపై సెటైర్లు

ఓవరాల్‌గా కేంద్ర బడ్జెట్ బాగుందన్న విజయసాయి రెడ్డిపై టీడీపీ సెటైర్లు గుప్పించింది. ఏపీకి ఏమీ ఇవ్వకున్నా కేంద్ర బడ్జెట్ బాగుందా? అని విమర్శించింది.

Samayam Telugu 12 Jul 2019, 6:31 pm
టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య అటు అసెంబ్లీలో.. ఇటు సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వం మారి 45 రోజులైనా గడవక ముందే.. అధికార పార్టీపై ప్రతిపక్షం విమర్శలు ఎక్కుబెడుతోంది. దీనికి అధికార పార్టీ కూడా ధీటుగానే బదులిస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై విజయసాయి రెడ్డి స్పందించిన తీరుపై టీడీపీ మండిపడుతోంది. ‘‘ఏపీకి ఏమీ ఇవ్వకపోయినా కేంద్ర బడ్జెట్ బాగుందంట! అలా మాట్లాడిన వారు ఎవరో ఏపీ అంటే పడని ఇతర రాష్ట్రాల వారై ఉంటారని అనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఏపీని ఏలుతున్న వైసీపీ పార్టీ నేత, రాష్ట్రం నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమాన్ విజయసాయి రెడ్డిగారు గురువారం రాజ్యసభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంలో సెలవిచ్చిన మాట అది’’ అని సోషల్ మీడియాలో టీడీపీ విమర్శలు గుప్పించింది.
Samayam Telugu vijayasai reddy


ఏపీ ప్రయోజనాలను వైఎస్ఆర్సీపీ ఏ స్థాయిలో కేంద్రానికి తాకట్టు పెట్టిందో అర్థం చేసుకోవచ్చన్న టీడీపీ.. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన పెద్దమనిషే ఇలా మాట్లాడితే ఇక కేంద్రం ఏపీని లెక్కచేస్తుందా? అని నిలదీసింది. ఈయనగారే ఇంకాస్త ముందుకెళ్ళి పెట్రోల్, డీజిల్ పై కేంద్రం సుంకం పెంచడాన్ని కూడా మెచ్చుకున్నారు. దీనివల్ల ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరుగుతుందట అంటూ సెటైర్లు వేసింది.

ఎవరికోసం ఇదంతా? తన మీద, తమ పార్టీ నాయకుడి మీదా ఉన్న కేసులకు భయపడే కదా ఇలా కేంద్రానికి దాసోహం అంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని టీడీపీ ఎద్దేవా చేసింది.

జూలై 5న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్లో ఏపీకి కేటాయింపులేం లేవని ఆయన తెలిపారు. కేంద్ర పన్నుల వాటా మినహా ఏపీకి అదనంగా ఏమీ ఇవ్వలేదన్నారు. పవర్ గ్రిడ్‌లను అనుసంధానం చేయడం బాగుందన్న ఆయన.. కొనుగొలు శక్తిలో భారత్ 13 నుంచి ఆరోస్థానానికి చేరుకోవడాన్ని ప్రశంసించారు. డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల రుణం ఇస్తామని ప్రకటించడం బాగుందన్నారు. ఓవరాల్‌గా బడ్జెట్ బాగుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.