యాప్నగరం

ప్రధాని ఎవరో మనమే తేలుద్దాం: చంద్రబాబు

‘‘2019 ఎన్నికల్లో టీడీపీ కీలక పాత్ర పోషించనుంది. ప్రధాన మంత్రిని కూడా మనమే తేలుద్దాం’’ అంటూ చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ గరుడపై కూడా పరోక్షంగా స్పందించారు.

Samayam Telugu 20 Apr 2018, 11:34 pm
శుక్రవారం తన పుట్టిన రోజు పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. రాత్రి ఏడు గంటలకు దీక్ష విరమించిన అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన దీక్షకు అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారని చంద్రబాబు పేర్కొన్నారు.
Samayam Telugu thumb.cms.


వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిపించాలని, భవిష్యత్తులో ప్రధాని ఎవరో మనమే తేలుద్దామని పిలుపునిచ్చారు. వ్యక్తిగత అజెండాతో పనిచేసే పార్టీలను దూరం పెట్టాలని చంద్రబాబు తెలిపారు. ధర్మ పోరాట దీక్ష స్ఫూర్తిదాయకంగా సాగిందన్నారు. రాష్ట్రాన్ని అస్థిర పరచేందుకు బీజేపీ చేస్తున్న ఆపరేషన్ గరుడ‌తో వ్యూహాన్ని పన్నుతుందనే సమాచారంపై చంద్రబాబు పరోక్షంగా స్పందిస్తూ..‘‘కర్ణాటక ఎన్నికల తర్వాత.. ఏపీపై దృష్టిపెడతారన్న వార్తలు వస్తున్నాయి. అయినా నేను వెనక్కి తగ్గే ప్రసక్తేలేదు. దేనికీ భయపడేది లేదు’’ అని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.