యాప్నగరం

వరద సమస్యకు పరిష్కారం చూపండి.. కాకినాడ ఎన్‌ఐహెచ్‌కు తెలంగాణ లేఖ

హైదరాబాద్‌లో వరదల సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం.. కాకినాడలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ (ఎన్‌ఐహెచ్)ని కోరింది. తెలంగాణ నీటి పారుదల శాఖ తరఫున ఎన్‌ఐహెచ్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌లో వరదలను అదుపు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పైలట్‌ ప్రాజెక్టుగా ఎన్‌ఐహెచ్‌ సహకారం కావాలని లేఖలో కోరారు.

TNN 21 Oct 2017, 1:34 pm
హైదరాబాద్‌లో వరదల సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం.. కాకినాడలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ (ఎన్‌ఐహెచ్)ని కోరింది. తెలంగాణ నీటి పారుదల శాఖ తరఫున ఎన్‌ఐహెచ్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌లో వరదలను అదుపు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పైలట్‌ ప్రాజెక్టుగా ఎన్‌ఐహెచ్‌ సహకారం కావాలని లేఖలో కోరారు. వరదలను ఎదుర్కొనేందుకు చెన్నైలో చేసినట్లుగా భాగ్యనగరానికి కూడా పరిష్కారం చూపాలని కోరారు. లేఖపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందిస్తామని కాకినాడ ఎన్‌ఐహెచ్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వై.ఆర్‌.ఎస్‌. సత్యాజీరావు తెలిపారు.
Samayam Telugu telangana asks solution from nih kakinada for floods in hyderabad
వరద సమస్యకు పరిష్కారం చూపండి.. కాకినాడ ఎన్‌ఐహెచ్‌కు తెలంగాణ లేఖ


ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. కాలువలు, చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల చిన్న వర్షం పడినా జంట నగరాలు చివురుటాకులా వణికిపోతున్నాయి. ప్రధాన రహదార్లన్నీ జలమయమైపోతున్నాయి.

భారీ వర్షాలు కురిస్తే.. లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లలో మునిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.