యాప్నగరం

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మార్చి8 నుంచి

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Samayam Telugu 20 Feb 2017, 10:27 am
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మార్చి 8 నుంచి మార్చి 28 వరకు జరపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. మార్చి 8న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. అనంతరం మార్చి 10న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Samayam Telugu telangana assembly budget session from march 8
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మార్చి8 నుంచి


బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఏయే శాఖలకు ఏమేరకు కేటాయింపులు చేయాలనేదానిపై మంత్రులు,శాఖలు, అధికారులు ఇప్పటికే రెడీ అయిపోయారు.

నిబంధనల ప్రకారం 16 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరగాలి. ఈ మేరకు ప్రభుత్వం సమావేశాలు జరపాలని నిర్ణయించింది.

అటు మార్చి 3 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు అమరావతిలో నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినందున...ఆ ప్రభుత్వం వినియోగించిన భవనాలు (అసెంబ్లీ) మార్చి 8లోపు అప్పగించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.