యాప్నగరం

Telangana Assembly: రాష్ట్రపతి పాలనకు బీజేపీ డిమాండ్?

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తొమ్మిది నెలల ముందే తెలంగాణ శాసనసభను సీఎం కేసీఆర్ రద్దు చేశారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Samayam Telugu 6 Sep 2018, 2:34 pm
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తొమ్మిది నెలల ముందే తెలంగాణ శాసనసభను సీఎం కేసీఆర్ రద్దు చేశారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత రెండు నెలల నుంచే కేసీఆర్ ముందస్తు సంకేతాలు వెలువరించడంతో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కూడా గురవారం మధ్యాహ్నం అత్యవసరంగా భేటీ అవుతోంది. భేటీ అనంతరం సాయంత్రం వారు గవర్నర్‌ను కలవనున్నారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను ఆ పార్టీ కోరనున్నట్టు సమాచారం. బీజేపీ డిమాండ్‌ను గవర్నర్ నరసింహన్ ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారనేది కీలకంగా మారింది. మరోవైపు అసెంబ్లీని రద్దు చేయాలంటూ క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. దీంతో శాసనసభ రద్దయినట్టు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి రాజ్‌భవన్ నుంచి నోటీసులు వెళ్లాయి.
Samayam Telugu తెలంగాణ అసెంబ్లీ


ఈ నేపథ్యంలో, ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాది డిసెంబరులో జరగబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం శాసనసభలతోపాటు తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా వచ్చే ఏప్రిల్, మేలో జరిగే సాధారణ ఎన్నికల వరకు వాయిదా వేస్తారా? అనేది ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అసెంబ్లీ రద్దుతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.