యాప్నగరం

మన సభలో కూడా లొల్లి ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన రెండో రోజే సభలో ప్రతిపక్షాలు ఆందోళన ప్రారంభించాయి.

Samayam Telugu 17 Dec 2016, 10:15 am
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన రెండో రోజే సభలో ప్రతిపక్షాలు ఆందోళన ప్రారంభించాయి. ప్రశ్నోత్తరాల సమయంలో పలు బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా..ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానాన్ని చేపట్టాలని పట్టుబట్టాయి. బీఏసీ నిర్ణయం ప్రకారం సభ సాగుతుందని స్పీకర్ మధుసూదనాచారి కాంగ్రెస్ సభ్యులకు సర్ధి చెప్పినా...వినిపించుకోలేదు.
Samayam Telugu telangana assembly opposition hit the house
మన సభలో కూడా లొల్లి ప్రారంభం


దీంతో మంత్రి హరీష్ రావు తొమ్మిది మంది కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ ఆమోదించడంతో వారిని స్పీకర్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు.

ఒకరోజు సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో గీతారెడ్డి, జీవన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, భట్టివిక్రమార్క, సంపత్ కుమార్, చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ పై సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని జానా అన్నారు.

అంతకుముందు మంత్రి మహేందర్ రెడ్డి విద్యుత్ బిల్లును మాట్లాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.