యాప్నగరం

అసెంబ్లీని బహిష్కరించిన ప్రతిపక్షాలు

గురువారం కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలు ఒకరోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాయి.

Samayam Telugu 29 Dec 2016, 11:43 am
గురువారం కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలు ఒకరోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాయి. బుధవారం అసెంబ్లీలో ఆమోదించిన భూసేకరణ చట్టం-2013పై జరిగిన చర్చలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, సభను తప్పుదోవ పట్టించి ఆ చట్టాన్ని ఆమోదించారని ఆరోపిస్తూ టీడీపీ, కాంగ్రెస్ ల సభు బహిష్కరించాయి.
Samayam Telugu telangana assembly opposition parties boycott assembly for one day
అసెంబ్లీని బహిష్కరించిన ప్రతిపక్షాలు


తమ పార్టీపై సీఎం నిందలు మోపారని, ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని సీపీఎం సభ్యులు సున్నం రాజయ్య డిమాండ్ చేశారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన 11రోజుల్లో 54గంటల పాటు ప్రతిపక్షాలే సభలో మాట్లాడాయని...సభను పక్కదోవ పట్టించి, ప్రజా సమస్యలు చర్చించకుండా చూసేందుకే ప్రతిపక్షాలు అసెంబ్లీని బహిష్కరించాయని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ అన్నారు.

సభను బహిష్కరించిన సభ్యులతో మాట్లాడి సభకు హాజరయ్యేవిధంగా చూడాలని బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి స్పీకర్ ను కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.