యాప్నగరం

టి.అసెంబ్లీ: నోట్ల రద్దు రాజ్యాంగ విరుద్దం: అక్బరుద్దీన్

నోట్ల రద్దు కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనేనని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు.

TNN 16 Dec 2016, 2:48 pm
కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతీ ఒక్కరిని దేశద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తోందని ఎంఐఎం శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. బీజేపీ ఏది చెపితే అదే జాతీయవాదం అని.. దాన్ని దేశ ప్రజలంతా తూచా తప్పకుండా పాటించి తీరాల్సిందేననే రీతిలో అరాచక పాలన కొనసాగుతోందని అక్బరుద్దీన్ నిప్పులు చెరిగారు. తెలంగాణ శాసన సభ శీతకాల సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న అక్బరుద్దీన్ పలు అంశాలను లేవనెత్తారు. తెలంగాణలో నగదు రహిత లావాదేవీల గురించి మాట్లాడే ముందు రాష్ట్రంలో అస్సలు ఒక్కటంటే ఒక్క ఏటీఎం కూడా లేని తొమ్మిది వేల గ్రామాల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu telangana assembly session mim mla akbaruddin remarks on demonetization
టి.అసెంబ్లీ: నోట్ల రద్దు రాజ్యాంగ విరుద్దం: అక్బరుద్దీన్


నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన, అందుకు అవసరమైన సదుపాయాలు కల్పించకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసి తీరాల్సిందేనని మెడపై కత్తిపెట్టిన రీతిలో ప్రభుత్వ చర్యలున్నాయని ఆరోపించారు. తెలంగాణలో బ్యాంకులు, పోస్టాఫీసులు లేని గ్రామాలు వేలాదిగా ఉన్నాయని సభ దృష్టికి తెచ్చారు. నోట్ల రద్దుతో దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిందని దీని ప్రభావం రానున్న రోజుల్లో మరింత ముదురుతుందన్నారు. నోట్ల రద్దు కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనేన్నారు.

నల్లధనానికి తమ పార్టీ పూర్తి వ్యతిరేకమని, దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే ప్రతీ చర్యను తాము సమర్ధిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మరో డిమాండును కూడా తెరమీదకు తెచ్చారు. రాజకీయ పార్టీలు నగదు రూపంలో పార్టీ విరాళాలు సేకరించే విధానానికి స్వస్థి పలకాలన్నారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సభకు విన్నవించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.