యాప్నగరం

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ.. 15 న బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2018-19 బడ్జెట్ ప్రతిపాదనలు, బడ్జెట్ పై చర్చ, ఆమోదమే లక్ష్యంగా సమావేశాలు జరుగనుండగా, సోమవారం గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Samayam Telugu 12 Mar 2018, 10:15 am
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2018-19 బడ్జెట్ ప్రతిపాదనలు, బడ్జెట్ పై చర్చ, ఆమోదమే లక్ష్యంగా సమావేశాలు జరుగనుండగా, సోమవారం గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటించడంతో ప్రభుత్వం వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని చూస్తే, వారిని ఈ సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా హెచ్చరించారు. మార్చి 12 ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుండగా, ఆపై 12 గంటలకు జరిగే బీఏసీ సమావేశంలో సభా కార్యకలాపాల నిర్వహణ, ఎన్ని రోజుల పాటు సభను నిర్వహించాలనే అంశాలను చర్చించనున్నారు.
Samayam Telugu telangana assembly to begin today budget on 15th
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ.. 15 న బడ్జెట్


తమ బస్సు యాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజా సమస్యలను సభలో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు విపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతాయనడంలో సందేహం లేదు. 2018-19 ఏడాదికి గానూ బడ్జెట్‌ను మార్చి 15 న ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర ప్రవేశపెట్టనున్నారు. తెరాస ప్రభుత్వానికి ఇది ఐదో బడ్జెట్ కాగా, సాధారణ ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. వీటిని తెరాస ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే సమావేశాలపై సీఎం కేసీఆర్ మూడుసార్లు సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రగతిని ప్రజలకు వివరించడానికి ఈ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని తెరాస భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.