యాప్నగరం

సభ్యుల సస్పెన్షన్.. అంతలోనే ఎత్తివేత!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ముగ్గురు సభ్యులను స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు.

TNN 27 Dec 2016, 11:42 am
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ముగ్గురు సభ్యులను స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తెదేపా సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకుంటున్నారని, వీరిని ఈరోజు సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆ ముగ్గురు సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసారు.
Samayam Telugu telangana assembly winter session speaker madhusudhanachari suspended members in assembly
సభ్యుల సస్పెన్షన్.. అంతలోనే ఎత్తివేత!


అయితే వీరిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని విపక్ష సభ్యులు స్పీకర్‌ను కోరారు. దీంతో సస్పెన్షన్ విధించిన కొద్దిసేపటికే స్పీకర్ ఎత్తివేశారు. సభా సంప్రదాయాలను అడ్డుకోవడం సరికాదని, సభ్యులు సభలో హుందాగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు అన్నారు. నిజానికి ఎస్సీ వర్గీకరణపై చర్చ చేపట్టాలని సంపత్ కుమార్, రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య సభలో ఆందోళనకు దిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.