యాప్నగరం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండే...

తెలంగాణ శాసన సభ శీతకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది.

TNN 16 Dec 2016, 9:17 am
తెలంగాణ శాసన సభ శీతకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుండి తెలంగాణ రాష్ట్ర ఉభయ సభలైన శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అటు విపక్ష పార్టీలు, వాటిని సమర్ధంగా అడ్డుకోవడానికి ఇటు ప్రభుత్వం తమదైన శైలిలో సంసిద్ధమవుతున్నాయి. పలు కీలకమైన అంశాలు ఈమారు జరిగే సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Samayam Telugu telangana assembly winter session to start from friday
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండే...


తొలి రోజయిన శుక్రవారం నాడు పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై, సామాన్యుల కష్టాలపై చర్చించాలని పార్టీలు నిర్ణయించాయి. దీనికి సభా నిర్వహణ సలహా సంఘం (బిఎసి) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తోడు మరో తొమ్మిది బిల్లులు ఈసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది. తొలి నుండి విపక్ష పార్టీలు ఎత్తి చూపుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆరోగ్యశ్రీ, రైతురుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, విద్యార్ధులకు చెల్లించాల్సిన బోధన రుసుములు, స్కాలర్ షిప్ అంశాలపై చర్చకు నేతలు పట్టుబట్టనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.