యాప్నగరం

ఈ బడ్జెట్ నుంచి రైతన్నకు వచ్చేదేంటి ?

వ్యవసాయరంగానికి రూ.5,942.97 కోట్లు కేటాయించినట్టు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్..

Samayam Telugu 13 Mar 2017, 12:52 pm
వ్యవసాయరంగానికి రూ.5,942.97 కోట్లు కేటాయించినట్టు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. వ్యవసాయ వృత్తిపై రాష్ట్ర జనాభాలో 50% మంది ఆధారపడివున్నారు. అందుకే తెలంగాణ రైతాంగం సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో రైతాంగానికి పెద్ద పీట వేసిందన్నారు మంత్రి ఈటల.
Samayam Telugu telangana budget 2017 18 allotments for agriculture
ఈ బడ్జెట్ నుంచి రైతన్నకు వచ్చేదేంటి ?


ఈ ఏడాది చేపట్టనున్న 4వ విడత చివరి రుణమాఫీతో రైతుల రుణాలు పూర్తిగా మాఫీ అవనున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కానుంది. ఇందు కోసం రూ.4,000 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే రైతులకి అండగా నిలిచేందుకు వారికి అందించే రుణాల లక్ష్యం రూ.46,946 కోట్లుగా నిర్ధేశించినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.