యాప్నగరం

తెలంగాణలో కొత్తగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు

ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా చేసిన ప్రసంగంలో మంత్రి ఈటల..

Samayam Telugu 13 Mar 2017, 2:30 pm
ఇంతకాలంపాటు ప్రభుత్వాల నుంచి నిర్లక్ష్యానికి గురైన అత్యంత వెనుకబడిన తరగతుల వారికోసం ఈసారి ప్రత్యేకంగా ఎంబీసీ(మెస్ట్ బ్యాక్‌వార్డ్ క్లాసెస్) కార్పోరేషన్ ఏర్పాటు చేసి, వారి అభివృద్ధి కోసం రూ.1,000 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా చేసిన ప్రసంగంలో మంత్రి ఈటల ఈ ప్రకటన చేశారు.
Samayam Telugu telangana budget allocations for mbc corporation
తెలంగాణలో కొత్తగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు


అత్యంత వెనుకబడిన తరగతులకి చెందిన ఎంతోమందికి వ్యవసాయం చేసుకోవడానికి మడి లేదు. బతుకుదెరువు కోసం ఉపాధి లేదు. అధికారంలో వాటా లేదు. ఎంబీసీ కులాల బిడ్డల్ని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఫలితంగా వారి పరిస్థితి ఎంతో ధీనంగా తయారైంది. వారి ఇబ్బందులని అర్థం చేసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో పెద్ద మనసుతో వారి కోసం ప్రత్యేకంగా ఓ కార్పోరేషన్ ఏర్పాటు చేశారని మంత్రి ఈటల వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.