యాప్నగరం

Telangana Cabinet: నేడు తెలంగాణ భేటీ.. కీలక అంశాలపై చర్చ

మూడోసారి సమావేశం కాబోతున్న మంత్రివర్గం.. కీలక అంశాలపై చర్చించబోతోంది. పాలనపరమైన, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, కొత్త చట్టాలు అమలుపై తీర్మానాలు చేసి.. రెవెన్యూ, పురపాలక, రోడ్డు భద్రత చట్టాలకు ఆమోదం తెలపనున్నారు.

Samayam Telugu 18 Jun 2019, 11:01 am
తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. నాలుగు నెలల తర్వాత మూడోసారి సమావేశం కాబోతున్న మంత్రివర్గం.. కీలక అంశాలపై చర్చించబోతోంది. పాలనపరమైన, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, కొత్త చట్టాలు అమలుపై తీర్మానాలు చేసి.. రెవెన్యూ, పురపాలక, రోడ్డు భద్రత చట్టాలకు ఆమోదం తెలపనున్నారు. ఎజెండాకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు.
Samayam Telugu kcr


ఎజెండాలో ప్రధానంగా.. రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీని అమలు చేయనుండగా.. దీనిపై కేబినెట్ చర్చించనుంది. ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించిన ఉత్తర్వులకు ఆమోదం తెలపనున్నారు. ములుగు, నారాయణపేట కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్తర్వులకు ఆమోదించనున్నారు. కాళేశ్వరం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ, మిషన్‌ కాకతీయ చర్చించి.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు రుణ సాయానికి అనుమతిపై నిర్ణయం తీసుకోనున్నారు.

కొత్త సచివాలయం, శాసనసభ నిర్మాణంపై చర్చించనున్నారు. అలాగే ఏపీలో ప్రభుత్వం ఉద్యోగులకు మధ్యంతర భృతి, సీపీఎస్‌ రద్దుపై నిర్ణయాలు తీసుకోవడంతో.. తెలంగాణ ప్రభుత్వంపై అందరి దృష్టి పడింది. దీంతో ఈ అంశంపై చర్చించబోతున్నారు. విద్య, వైద్యరంగం, ఉద్యోగ నియామకాలకు ఆమోదాలు వంటివాటిపైనా చర్చించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.