యాప్నగరం

ఉర్దూ ద్వితీయ అధికారిక భాష: కేసీఆర్

తెలంగాణలో ఉర్దూను రెండో అధికార భాషగా ప్రభుత్వం ప్రకటించింది.

TNN 10 Nov 2017, 12:59 pm
తెలంగాణలో ఉర్దూను రెండో అధికార భాషగా ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై రాష్ట్రంలో ఉర్దూ ద్వితీయ భాషగా ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం శాసనసభలో ప్రకటించారు. జిల్లా యూనిట్‌గా కాకుండా హైదరాబాద్ యూనిట్‌గా ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేస్తామని చెప్పారు. ‘ఉర్దూను ద్వితీయ భాషగా ప్రకటించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అందుకే జిల్లాలను యూనిట్‌గా తీసుకోకుండా మొత్తం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఉర్దూను ద్వితీయ భాషగా అమలు చేస్తాం’ అని శాసనసభలో ప్రకటించారు.
Samayam Telugu telangana cm declares urdu as states second official language
ఉర్దూ ద్వితీయ అధికారిక భాష: కేసీఆర్


అలాగే రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉర్దూలో మాట్లాడే ఒక అధికారిని నియమించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. కాగా, రాష్ట్ర జనాభాలో ముస్లింలు 12.7 శాతం ఉన్నారు. శాసనసభలో ముస్లిం మైనారిటీ సంక్షేమంపైనే గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. ముస్లింలకు ఇచ్చిన హామీలన్నీ పెండింగులోనే ఉన్నాయని, వాటిని త్వరగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా శాసనసభలో ముఖ్యమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తాజా ప్రకటన చేశారు. కేసీఆర్ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కేసీఆర్ ముస్లిం మైనారిటీలపై అమితమైన ప్రేమను కురిపించేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.