యాప్నగరం

కేసీఆర్ ఏపీ పర్యటన రద్దు.. జగన్ ఎఫెక్టే కారణమా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ పర్యటన రద్దయ్యింది. జగన్ గృహప్రవేశం వాయిదా పడటంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.

Samayam Telugu 13 Feb 2019, 11:11 pm
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీ పర్యటన రద్దయ్యింది. అమరావతిలో వైఎస్ జగన్ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు విశాఖ శారదా పీఠాన్ని సందర్శించాలని కేసీఆర్ ముందుగా నిర్ణయించారు. కానీ తెలంగాణ సీఎం ఏపీ పర్యటన రద్దయ్యిందని సమాచారం అందింది. విశాఖలోని శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని పీఠాధిపతి.. కేసీఆర్‌ను ఆహ్వానించారు. కానీ ఈ కార్యక్రమానికి సీఎం వెళ్లడం లేదని తెలుస్తోంది.
Samayam Telugu kcr61


కేసీఆర్ బదులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శారదా పీఠం వెళ్లనున్నారు. ఎన్నికల్లో విజయం కోసం కేసీఆర్ తన వ్యయసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే.

వైఎస్ షర్మిల అనారోగ్యం కారణంగా జగన్ నూతన గృహప్రవేశం వాయిదా పడింది. ఈ కారణంగానే కేసీఆర్ ఏపీ పర్యటన రద్దు చేసుకున్నారని భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 8 గంటల 21 నిమిషాలకు తాడేపల్లిలో జగన్ గృహ ప్రవేశం చేయాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.