యాప్నగరం

పెద్ద నోట్ల రద్దుతో చాలా నష్టపోయామన్న కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను నిషేధించటం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. నోట్ల రద్దు నేపథ్యంలో కీలక విషయాలు చర్చించేందుకు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.

TNN 11 Nov 2016, 5:13 pm
కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను నిషేధించటం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల నిషేధం కారణంగా రాష్ట్రాల ఆదాయంపై తీవ్ర నష్టభారం పడుతుందనేది ఆయన అభిప్రాయం.
Samayam Telugu telangana cm kcr meets governor narasimhan on ban of big notes
పెద్ద నోట్ల రద్దుతో చాలా నష్టపోయామన్న కేసీఆర్


నోట్ల రద్దు నేపథ్యంలో కీలక విషయాలు చర్చించేందుకు గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్ర ఆదాయం నెలకు 2 వేల కోట్లు నష్టపోయే పరిస్థితి నెలకొందని ఆయన గవర్నకు వివరించారు. గత రెండు రోజులుగా తెలంగాణ ఆదాయం 90% పడిపోయిందని గవర్నర్ తో చెప్పినట్లు సమాచారం. రోజుకు సుమారు 3 వేల రిజిస్ట్రేషన్లు కావాల్సి ఉండగా బుధవారం 150, గురువారం 300 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. 2 లక్షల లోపు విలువైన వాహనాల కొనుగోళ్లు తగ్గాయి. బుధవారం 1700, గురువారం 1100 వాహనాలు కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల కొనుగోళ్లు 90 శాతం పడిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే అవకాశం ఏర్పడింది. నగదు చలామణిపై ఆంక్షలు విధించటంతో చిన్న వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుంది అని గవర్నర్ నరసింహన్‌కు సీఎం కేసీఆర్ వివరించినట్లు తెలిసింది.



కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏడాదికి రూ. 13 వేల 995 కోట్లు రావాలి. వీటిని 14 వాయిదాల్లో నెలకు రూ.997 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రతి నెలా కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 42 శాతం కోత విధించారు. ఈనెలలో రూ. 585 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన ప్రతినెల 400 కోట్లుకు పైగా నష్టం వస్తుంది. సహజంగా ఏడాది చివరల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. తమకు ఆదాయం తగ్గిందని కేంద్రం నవంబర్‌ నుంచే కోత విధించడం దేశంలోని రాష్ట్రాలకు తీవ్ర నష్టమని కేసీఆర్ అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం వ్యవహారశైలి ఉందని కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ విధంగా రాష్ట్రాలకు ఇచ్చే నిధులపై కోతలు విధించడం వలన పథకాల అమలు సాధ్యపడదు. పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి అని గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.