యాప్నగరం

KCR: కేసీఆర్ ఇంట విషాదం.. ఆయన సోదరి కన్నుమూత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరి లీలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం యశోదా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

Samayam Telugu 6 Aug 2018, 12:45 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరి లీలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం యశోదా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ సోదరి మరణవార్త తెలుసుకుని అర్థాంతరంగా ముగించి హైదరాబాద్‌కు పయనమయ్యారు. మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు.లీలమ్మ మృతివార్త తెలుసుకున్న కేసీఆర్‌ బంధువులు, సన్నిహితులు ఆయన నివాసానికి తరలి వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. మరోవైపు మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనను రద్దు చేసుకుని నగరానికి చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సీఎం కేసీఆర్ సతీమణి శోభలు యశోద హాస్పిటల్‌కు చేరుకుని లీలమ్మ పార్థివదేహాన్ని ఆమె నివాసానికి తరలించారు.
Samayam Telugu కేసీఆర్ సోదరి కన్నుమూత


సీఎం కేసీఆర్‌కు లీలమ్మ నాలుగో అక్క. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన శంకరరావును ఆమె వివాహం చేసుకున్నారు. వారికి కాంతారావు, మధుసూదన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసీఆర్‌కు మొత్తం 10 మంది తోబుట్టువులున్నారు. వీరిలో 8 మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.