యాప్నగరం

కీసర, కురవిలో మొక్కులు చెల్లించుకోనున్న కేసీఆర్

గతేడాది వరంగల్‌లో భద్రకాళీ ఆలయం సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్

Samayam Telugu 7 Dec 2022, 11:18 am
గతేడాది వరంగల్‌లో భద్రకాళీ ఆలయం సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మొన్న తిరుమలకి వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మొక్కులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడదే తరహాలో నేడు మహా శివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా, హైదరాబాద్ సిటీ శివార్లలో వున్న కీసర ఆలయాన్ని సందర్శించి అక్కడ కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామిరి వారికి మొక్కులు సమర్పించుకోనున్నారు.
Samayam Telugu kcr
కేసీఆర్


ఉదయం 9 గంటలకి హెలీక్యాప్టర్‌లో కీసరకి వెళ్లనున్న కేసీఆర్ అక్కడ దర్శనం ముగించుకున్న అనంతరం అక్కడి నుంచే హెలీక్యాప్టర్‌లో మహబూబాబాద్ జిల్లా కురవిలో కొలువుదీరిన శ్రీ వీరభద్ర స్వామి (వీరన్న)ని దర్శించుకోనున్నారు. ఉద్యమం సమయంలో ఓ సందర్భంలో కురవికి వెళ్లిన సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే, వీరన్న స్వామికి బంగారు మీసాలు చేయిస్తానని మొక్కుకున్నారట. ఆ ప్రకారమే ఇవాళ కేసీఆర్ తన మొక్కు తీర్చుకోనున్నారు.

జిల్లాల పునర్విభజనకు ముందు వరంగల్ జిల్లా పరిధిలో వున్న ఈ వీరభద్రస్వామి దేవాలయం కురవి వీరన్నగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ జరిగే ఉత్సవాలకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లనుంచే కాకుండా పొరుగునే వున్న చత్తీస్‌ఘడ్, ఒడిషా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.