యాప్నగరం

పూరీ జగన్నాథుని సేవలో సీఎం కేసీఆర్

పూరీ జగన్నాథుడి సేవలో తెలంగాణ సీఎం కేసీఆర్. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ సందర్శన. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ సీఎం.

Samayam Telugu 24 Dec 2018, 11:41 am
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూరీ జగన్నాథస్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న సీఎం దంపతులకు పూరీ ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కేసీఆర్‌కు ఆశీర్వచనాలు.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేసీఆర్ మరికాసేపట్లో కోణార్క్ ఆలయాన్ని సందర్శించుకోనున్నారు.
Samayam Telugu kcr


మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా నాలుగు రాష్ట్రాల పర్యటిస్తున్న కేసీఆర్.. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు పయనమవుతారు. సాయంత్రం 4 గంటలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశం అవుతారు. దేశ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై మమతతో చర్చించనున్నారు.

ఫ్రంట్ చర్చల్లో భాగంగా ఆదివారం కూడా ( డిసెంబర్ 23)న కేసీఆర్ భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయాలతో పాటూ ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుపై ఇద్దరు నేతలు చర్చించారు. ది ఆరంభం మాత్రమేనని.. ఎన్నో అంశాలపై మాట్లాడాల్సి ఉందన్నారు. ఫ్రంట్‌పై చర్చించేందుకు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.