యాప్నగరం

26న తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహ కమిటీ తొలి సమావేశం

నవంబరులోనే ఎన్నికలు వస్తాయన్న వార్తల నేపథ్యంలో 26న జరుగబోయే తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకమిటీ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Samayam Telugu 25 Sep 2018, 9:44 am
తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహ కమిటీ మొదటి సమావేశాన్ని సెప్టెంబరు 26న నిర్వహిస్తామని ఆ కమిటీ చైర్మన్‌, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు (వీహెచ్‌) సోమవారం (సెప్టెంబరు 24) తెలిపారు. కమిటీ సభ్యులు మాజీ ఎంపీలు సర్వే సత్యనారాయణ, మధుయాష్కి గౌడ్‌, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, మాజీ ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్‌, రేణుకా చౌదరి, నేతలు.. నాగం జనార్దన్‌ రెడ్డి, గడ్డం ప్రసాద్‌ కుమార్‌, క్యామ మల్లేశ్‌ తదితరులు హాజరవుతారని ఆయన తెలిపారు. నవంబరులోనే తెలంగాణ ఎన్నికలు వస్తాయన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
Samayam Telugu hanumantharao


ఢిల్లీలో జానా బిజీ.. బిజీ..
హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిన మాజీ మంత్రి జానారెడ్డి.. తిరుగు ప్రయాణంలో సోమవారం ఢిల్లీలోనే ఉండిపోయారు. అక్కడ ఆయన ఏఐసీసీ ముఖ్యలను కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలవాలనుకున్నా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఏఐసీసీ ముఖ్యులను ఆయన కలిశారు. రాహుల్‌గాంధీని కలిసి తన కుమారుడికి మిర్యాలగూడ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరడానికే ఆయన ఢిల్లీ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే రాహుల్‌గాంధీ అమేథి పర్యటనకు వెళ్లడంతో.. అధిష్ఠానం పెద్దలను కలిసిన ఆయన.. గత ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలుపునకు తాను చేసిన కృషిని వివరించినట్లు తెలిసింది. మరోవైపు..తాను వ్యక్తిగత పనుల నిమిత్తమే కుమారుడితో కలిసి ఢిల్లీకి వచ్చినట్లు తనను కలిసిన మీడియాతో జానారెడ్డి స్పష్టంచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.