యాప్నగరం

రాజ్యసభ బరిలో కాంగ్రెస్.. పరిశీలనలో మాజీ క్రికెటర్ పేరు

తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల బరిలో కాంగ్రెస్ కూడా నిలబడాలని నిర్ణయించదట. గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా సమావేశమయ్యారు. మూడు గంటల పాటూ సాగిన భేటీలో చివరికి అభ్యర్థిని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారట.

Samayam Telugu 9 Mar 2018, 11:06 pm
తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల బరిలో కాంగ్రెస్ కూడా నిలబడాలని నిర్ణయించదట. గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా సమావేశమయ్యారు. మూడు గంటల పాటూ సాగిన భేటీలో చివరికి అభ్యర్థిని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే అధిష్టానం పరిశీలనలో గూడూరు నారాయణరెడ్డి, అజారుద్దీన్ పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరి పేరును ఖాయం చేయాలని భావిస్తున్నారట.
Samayam Telugu telangana congress decided to field candidate in rs polls
రాజ్యసభ బరిలో కాంగ్రెస్.. పరిశీలనలో మాజీ క్రికెటర్ పేరు


మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే... రెండు టీఆర్‌ఎస్‌కు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరో స్థానాన్ని ఎంఐఎంతో కలిసి గెలుచుకునే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 21మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో ఏడుగురు పార్టీ మారారు. ఇద్దరు చనిపోగా... ఆ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. ఇక మిగిలింది 12మంది సభ్యులు మాత్రమే. అయితే ఈ సంఖ్యతో రాజ్యసభ సీటును కాంగ్రెస్ ఎలా గెలుచుకుంటుదన్నది ఆసక్తిగా మారింది. ఏ దీమాతో అభ్యర్థిని బరిలోకి దింపుతుందో అనేది సస్పెన్సే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.