యాప్నగరం

Telangana Elections: ఎంపీగానే పోటీ చేస్తా - జైపాల్‌రెడ్డి

కొద్దిరోజులుగా జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో సోమవారం ఆయన ఒక మీడియా ప్రకటన విడుదల చేశారు.

Samayam Telugu 25 Sep 2018, 9:53 am
రాబోయే శాసనసభ ఎన్నికల్లో తాను మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయడంలేదని కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. కొద్దిరోజులుగా జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆయన ఈ మేరకు సోమవారం (సెప్టెంబరు 24) మీడియా ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu jaipal


కేసీఆర్‌ నమ్మకద్రోహి..
కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఓ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ప్రజలను నిలువునా వంచించారని జైపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ నమ్మకద్రోహి అని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చేందుకు తాను స్వయంగా సోనియాతోపాటు ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌ను కలిసి ఒప్పించానని గుర్తుచేశారు. బంగారు తెలంగాణ పేరిట ప్రజలను వంచించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.