యాప్నగరం

నయీం కేసులో ఐదుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్

గతేడాది జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీంతో సత్సంబంధాలు కలిగి వున్నట్టుగా ఆరోపణలు..

Samayam Telugu 12 May 2017, 12:44 am
గతేడాది జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీంతో సత్సంబంధాలు కలిగి వున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఐదుగురు పోలీసు అధికారులని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ. సస్పెండ్ అయిన వారిలో మద్దిపాటి శ్రీనివాస్, చింతమనేని శ్రీనివాస్, మలినేని శ్రీనివాస్, రాజగోపాల్, మస్తాన్ వలీ వున్నారు. నయీంతో కలిసి భారీ స్థాయిలో సెటిల్మెంట్స్, భూ దందాలు చేసినట్టు వీరిపై అభియోగాలు వున్నాయి.
Samayam Telugu telangana dgp anurag sharma suspends 5 cops from duties whose names are linked to nayeem
నయీం కేసులో ఐదుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్


నయీం మృతి అనంతరం భువనగిరి రూరల్ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన అనేక ఘటనల్లో వీళ్ల పేర్లు బయటపడ్డాయి. అప్పటి నుంచే పోలీసు శాఖ వీరి కదలికలపై నిఘా పెట్టింది. వీరిపై నమోదైన అభియోగాలు నిరూపించడానికి వీలుగా ఆధారాలు సేకరించిన తర్వాతే వేటు వేసినట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.