యాప్నగరం

తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Samayam Telugu 1 Jun 2019, 4:34 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 2.. మనందరికీ పండుగ రోజన్న ఆయన.. తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజన్నారు. అనేక మంది యోధుల త్యాగ ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంతం అంటే తనకెంతో ఇష్టమని చెప్పే పవన్.. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ తన పార్టీ తరఫున తెలంగాణలో అభ్యర్థులను బరిలో నిలిపారు.
Samayam Telugu pk ts


‘‘జూన్‌ 2.. మనందరికీ పండుగ రోజు. తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు. అనేకమంది యోధుల త్యాగ ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు. ఇటువంటి పర్వదినాన తెలంగాణ బిడ్డలందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన అమరులకు ఈ సందర్బంగా అంజలి ఘటిస్తున్నాను. అభివృద్ధి ఫలాలు అందరికీ అందిననాడే వారికి నిజమైన నివాళి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల మాటలు మరో మారు నిజం కావాలని కోరుకుంటున్నాన’’న్న పవన్ కళ్యాణ్ సందేశాన్ని జనసేన ట్వీట్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.