యాప్నగరం

కొత్త బడ్జెట్ తీసుకువచ్చే ఆలోచనలో తెలంగాణ సర్కార్

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంలో నూతన ఒరవడి తీసుకురావడానికి కేంద్రం ఎలాగైతే కొత్త ప్రయత్నాలు చేస్తోందో అలాగే తెలంగాణ...

Samayam Telugu 16 May 2017, 2:58 pm
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంలో నూతన ఒరవడి తీసుకురావడానికి కేంద్రం ఎలాగైతే కొత్త ప్రయత్నాలు చేస్తోందో అలాగే తెలంగాణ సర్కార్ కూడా కొత్త విధానంలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. క్యాలెండర్ సంవత్సరం నుంచి కాలెండర్ సంవత్సరం వరకు (జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 తేదీ వరకు) వర్తించే విధంగా బడ్జెట్‌ని ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం వున్నట్లు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలిపారు. అందుకు సంబంధించిన అధ్యయనం కోసం ప్రభుత్వ ఆర్థిక శాఖ, సంబంధిత ఉన్నతాధికారులతో సీఎం చర్చలు జరుపుతున్నారు.
Samayam Telugu telangana government planning for new kind of budget policy
కొత్త బడ్జెట్ తీసుకువచ్చే ఆలోచనలో తెలంగాణ సర్కార్


అయితే, అంతకన్నా ముందుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ పద్ధతిని అవలంభిస్తున్నందున అక్కడి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులని సంప్రదించి, అక్కడి విధి, విధానాలపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించడం వల్ల సాంప్రదాయ పద్ధతి నుంచి నయా సాంప్రదాయంలోకి మారడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కున్న సవాళ్లు, సమస్యలు ఏంటో తెలుసుకునే వీలు కలుగుతుందనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు సహా ఇతర అధికార్ల బృందాన్ని మధ్యప్రదేశ్ వెళ్లి రమ్మని సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.