యాప్నగరం

ఆమ్రపాలికి పోస్టింగ్.. ఆ జిల్లా కలెక్టర్ మళ్లీ మార్పు, 9 మంది ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణ సర్కారు బుధవారం మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది, 9 మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం కల్పించింది.

Samayam Telugu 30 Aug 2018, 8:23 am
ముందస్తు ఎన్నికల కోసం సమాయాత్తం అవుతోన్న తెలంగాణ సర్కారు కీలక అధికారులను బదిలీ చేస్తోంది. మంగళవారం 11 మంది ఐఏఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసిన కేసీఆర్ సర్కారు.. బుధవారం 9 మంది ఐపీఎస్‌లకు, మరో ముగ్గురు ఐఏఎస్‌లకు స్థాన చలనం కల్పించింది. వెయిటింగ్‌లో ఉన్న ఇద్దరు ఐఏఎస్‌లకు పోస్టింగ్ ఇచ్చింది. ఐదుగురు ఐఏఎస్ అధికారుల పోస్టింగుల్లోనూ మార్పులు చేసింది. ఇప్పటి దాకా వెయిటింగ్‌లో ఉన్న రాహుల్ బొజ్జాను వ్యవసాయ శాఖ కమిషనర్‌గా నియమించారు. వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలిని బదిలీ చేసి వెయిటింగ్ లిస్టులో ఉంచగా.. ఆమెకు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
Samayam Telugu ts


జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పని చేస్తోన్న భాతరి హొల్లికెరిని మంచిర్యాల కలెక్టర్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా క.శశాంకను నియమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా మంగళవారం అమోయ్ కుమార్‌ను నియమించిన సర్కారు.. దాన్ని రద్దు చేసింది. ప్రస్తుతం ఆయన్ను వెయిటింగ్‌లో పెట్టగా.. ఆయన స్థానంలో భద్రాద్రి కలెక్టర్‌గా ‘ధరణి’ ఓఎసీడీగా ఉన్న రజత్ కుమార్ షైనీని నియమించింది. అమోయ్ 2014లో కొత్తగూడెం ఆర్డీవోగా పని చేసిందున.. ఆయన్ను మళ్లీ 2019 ఎన్నికల సమయంలో అదే జిల్లా కలెక్టర్‌గా వ్యవహరిస్తే ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతోనే ఆయన నియామకాన్ని ఉపసంహరించింది.

బదిలీ అయిన ఐపీఎస్‌లు:
* హైదరాబాద్ అడిషనల్ సీపీ (అడ్మిన్)గా శివప్రసాద్
* రామగుండం పోలీస్ కమిషనర్‌గా సత్యనారాయణ
* సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీగా మురళీకృష్ణ
* హైదరాబాద్ సోత్ జోన్ డీసీపీగా అంబర్ కిషోర్ ఝా
* సూర్యాపేట ఎస్పీగా వెంకటేశ్వర్లు
* భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా సునీల్ దత్
* వనపర్తి ఎస్పీగా అపూర్వారావు
* జగిత్యాల ఎస్పీగా సింధు శర్మ
* సీఐడీ ఎస్పీగా ప్రకాశ్ జాదవ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.