యాప్నగరం

హైదరాబాద్‌లో వరల్డ్ క్లాస్ ఫిలిం స్కూల్

హైదరాబాద్‌లో త్వరలోనే ప్రపంచస్థాయికి తగిన విధంగా ఓ ఫిలిం స్కూల్ ఏర్పాటు కానుందని తెలుస్తోంది.

TNN 5 Sep 2017, 3:56 pm
హైదరాబాద్‌లో త్వరలోనే ప్రపంచస్థాయికి తగిన విధంగా ఓ ఫిలిం స్కూల్ ఏర్పాటు కానుందని తెలుస్తోంది. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి కొత్తగా వచ్చిన చైర్మన్ రామ్మోహన్ రావు అధికారులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పినట్టు వార్తలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలో సుమారు 50 ఎకరాల స్థలంలో ఈ ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కానుందని, దీని కోసం స్థలం కేటాయింపు విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఒక్కటే మిగిలివుందని ఆయన అధికారులతో చెప్పినట్టు సమాచారం.
Samayam Telugu telangana govt planning to set up world class film school
హైదరాబాద్‌లో వరల్డ్ క్లాస్ ఫిలిం స్కూల్


ఫిలిం స్కూల్‌తో పాటే ఓ ఫిలిం స్టూడియో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 మండల్లో మినీ థియేటర్ల నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని రామ్మోహన్ రావు చెప్పారనేది ఆ వార్తా కథనాల సారాంశం. ఇప్పటికే భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన సినీ ప్రముఖులు పలు ప్రతిష్టాత్మకమైన చిత్రాల చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లోని ఫిలిం స్టూడియోలు, చారిత్రాత్మక, పర్యాటక ప్రాంతాలని తమకి అనువైన ప్రాంతాలుగా ఎంచుకుంటున్నారు. ఈ క్రమలోనే హైదరాబాద్‌ని మరింత అభివృద్ధి చేసి సినీ నిర్మాణానికి సిటీని ఓ డెస్టినేషన్‌గా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందట.

వాస్తవానికి మిని థియేటర్ల నిర్మాణం అనేది ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతున్న అంశమే. కానీ హైదరాబాద్‌లో వరల్డ్ క్లాస్ ఫిలిం స్కూల్ ఏర్పాటు అనేదే కొత్తగా తెరపైకొస్తున్న అంశం. మున్ముందు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయమై ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.