యాప్నగరం

Tik Tok వివాదం.. నా మనవడు తప్పు చేస్తే చర్యలు తీసుకోండి: తెలంగాణ హోంమంత్రి

Home Minister Mahmood Ali | టిక్‌టాక్ వివాదంపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. తన మనవడు ఫర్కాన్‌ను మందలించారు. అతడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఉంటే చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు సూచించారు.

Samayam Telugu 19 Jul 2019, 3:06 pm
స్నేహితుడితో కలిసి టిక్‌టాక్ వీడియో చేసి తెలంగాణ హోంమంత్రి మనవడు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. టిక్ టాక్ వీడియో చేసిన తన మనవడు ఫర్కాన్ అహ్మద్‌ను ఆయన మందలించారు. తన మనవడు ఫర్కాన్ అహ్మద్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఉంటే అతడిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు.
Samayam Telugu tiktok
టిక్ టాక్ వీడియో


ఫర్కార్ అహ్మద్ ఓ జీపుపై కూర్చొని ఉండగా.. అతడి స్నేహితుడు టిక్‌టాక్ చేసిన వీడియో ఒకటి రెండు రోజులుగా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ‘నా స్నేహితుడిని గౌరవించకపోతే.. పీక కోస్తా’ అనే డైలాగ్‌తో ఫర్కాన్ స్నేహితుడు టిక్‌టాక్ చేశాడు. అది సినిమా డైలాగ్ అయినప్పటికీ.. పోలీస్ ఐజీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఉండటంతో నెటిజన్లు అభ్యంతరం తెలిపారు.

ఫర్కాన్ కూర్చొని ఉన్న వాహనం కూడా ఓ పోలీస్ ఉన్నతాధికారిదే కావడంతో ఈ అంశం మరింత వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్ అలీ తన మనవడు ఫర్కాన్‌ను మందలించారు..

వివాదాస్పదమైన టిక్‌టాక్ వీడియో ఇదే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.