యాప్నగరం

తెలంగాణ ఇంటి పార్టీ: తొలిరోజే అబద్ధంతో...

తెలంగాణలో మరో రాజకీయపార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ అవతరణ దినోత్సమైన జూన్ 2 శుక్రవారం నాడు తెలంగాణ

Samayam Telugu 3 Jun 2017, 10:59 am
తెలంగాణలో మరో రాజకీయపార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ అవతరణ దినోత్సమైన జూన్ 2 శుక్రవారం నాడు తెలంగాణ ఉద్యమనేత చెరుకు సుధాకర్ అధ్యక్షతన ‘తెలంగాణ ఇంటి పార్టీ’ ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్సీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితరులు టీఐపీలో ముఖ్యనేతలు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్టీ ఆవిర్భావ సభ జరిగింది.
Samayam Telugu telangana inti party floated by cheruku sudhakar
తెలంగాణ ఇంటి పార్టీ: తొలిరోజే అబద్ధంతో...


ఈ సందర్భంగా అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ..కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. బడుగు బలహీన వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. ‘బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ కు దమ్ముంటే కనీసం ఉపముఖ్యమంత్రి పదవిని బీసీకి కట్టబెట్టాలని’ చెరుకు సుధాకర్ సవాల్ చేశారు.

కానీ.. తెలంగాణ రాష్ట్రసాధనే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన కేసీఆర్.. తాము అధికారంలోకి వస్తే.. దళితుడిని సీఎం చేస్తాని దాదాపు 14ఏళ్లపాటు వాగ్ధానం చేశారు. బీసీని సీఎం చేస్తానని ఎక్కడా చెప్పలేదు. అలాంటిది చెరుకు సుధాకర్ పార్టీ పెట్టిన రోజునే ‘అబద్ధపు ఆరోపణ’తో టిఆర్ఎస్ ను టార్గెట్ చేయడం..భవిష్యత్ లో ఆయన పార్టీకే నష్టం తెస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఇంటి పార్టీని బలోపేతానికి ఇలాంటి వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారతాయని.. కొత్తపార్టీపై విముఖ ఏర్పడుతోందని వాదన వినిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.