యాప్నగరం

ఆ జెంటిల్‌మెన్‌కు సారీ..మళ్లీ అలాంటివి జరగనివ్వం: కేటీఆర్

మంత్రి కేటీఆర్ ఓ సామాన్యుడికి సారీ చెప్పారు. తనవల్ల పొరపాటు జరిగి ఉంటే క్షమించాలంటూ ట్విట్టర్‌లో స్పందించారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన దృష్టికి వచ్చిన వెంటనే ట్వీట్ చేసి... మంత్రి గొప్ప మనసును చాటి చెబుతోంది.

Samayam Telugu 12 Apr 2018, 1:46 pm
మంత్రి కేటీఆర్ ఓ సామాన్యుడికి సారీ చెప్పారు. తనవల్ల పొరపాటు జరిగి ఉంటే క్షమించాలంటూ ట్విట్టర్‌లో స్పందించారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన దృష్టికి వచ్చిన వెంటనే ట్వీట్ చేయడం... మంత్రి గొప్ప మనసును చాటి చెబుతోంది. హైదరాబాద్ శివారులోని దమ్మాయిగూడలో జితేందర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన రోడ్డు మీదుగానే మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వెళుతోంది. వెంటనే అతడు కుటుంబ సభ్యుల సాయంతో ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో 20 నిమిషాల పాటూ రోడ్డుపైనే నరకం అనుభవించాడు. తర్వాత ఆస్పత్రికి వెళ్లాడు. దీనిపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Samayam Telugu KTR Tweet


ఈ ఘటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ స్టోరీని ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేయగా... వెంటనే మంత్రి స్పందించారు. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా... తన పనితీరు ఎప్పుడూ అలా ఉండదన్నారు. ఒకవేళ అది నిజమైతే... ఆ జెంటిల్‌మెన్‌కు క్షమాపణలు చెబుతున్నా... ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. మంత్రి అయినా ఎలాంటి గర్వం లేకుండా సామాన్య వ్యక్తికి క్షమాపణలు చెప్పడం గ్రేట్ అంటున్నారు. అలాగే బాధితుడికి అండగా నిలిచిన టైమ్స్ ఆఫ్ ఇండియాకు అభినందనలు తెలుపుతున్నారు.

Read This Story Also In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.