యాప్నగరం

ఎస్ఐ మహేశ్‌పై కేటీఆర్ ప్రశంసలు

సైబరాబాద్ పరిధిలోని ఓ ఎస్ఐ సేవాగుణం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను ఆకట్టుకున్నాయి. ఓ చిన్నారిని రోడ్డు ప్రమాదంలో కాపాడి, ఆమె చికిత్సకు సాయం అందించిన అతడిపై ప్రశంసలు కురిపించారు.

TNN 2 Mar 2018, 8:05 am
ఇటీవల బుద్వేల్ రైల్వే స్టేషన్‌ సమీపంలో తల్లిదండ్రులతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తోన్న ఆరేళ్ల చిన్నారి సాయికుమార్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సమయంలో అదే మార్గంలో ప్రయాణిస్తోన్న సైబరాబాద్ ఎస్ఐ మహేశ్ తన వాహనంలో ఆ పాపను ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు ఆ చిన్నారి వైద్యానికి అయిన ఖర్చు మొత్తం తానే భరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దామరగిద్దకు చెందిన ఓ వృద్ధురాలు నగరంలో చనిపోయారు. స్వగ్రామానికి తరలించేందుకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న ఆమె కుమారుడికి రూ.7వేలు ఆర్థిక సాయం అందించి తన మానవతను మరోసారి చాటుకున్నారు. ఈ విషయం ప్రసార, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా మహేశ్‌ పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
Samayam Telugu telangana minister ktr appreciates rgia si mahesh charity
ఎస్ఐ మహేశ్‌పై కేటీఆర్ ప్రశంసలు


ఇలాంటి పోలీసులకు తగిన గుర్తింపు ఇవ్వాలని డీజీపీ, సైబరాబాద్‌ కమిషనర్‌ను కేటీఆర్ కోరారు. తాజాగా గురువారం అతడిని స్వయంగా తనవద్దకు పలిపించుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ‘శభాష్‌.. మహేశ్‌.. మీలాంటి పోలీసులు తెలంగాణకు అవసరం’ అంటూ ఆయనను అభినందించారు. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌ వద్ద గురువారం బందోబస్తు నిర్వహిస్తున్న విమానాశ్రయ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేశ్‌ను చూసిన కేటీఆర్ తన వద్దకు పిలిపించుకుని, 20 నిమిషాల సేపు ముచ్చటించారు. ఆపదలో ఉన్న వారికి మహేశ్‌ చేసిన సాయాన్ని గుర్తు చేస్తూ సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ పోలీస్‌శాఖ ప్రతిష్ఠను పెంచాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.