యాప్నగరం

మా బాస్‌లు గల్లీల్లో..మీ బాస్‌లు ఢిల్లీలో: మంత్రి కేటీఆర్

కాంగ్రెస్‌పై మండిపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వరంగల్ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు... కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. తర్వాత మాట్లాడిన ఆయన... పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటూ ఆ పార్టీ నేతలపై మాటల తూటాలు పేల్చారు.

Samayam Telugu 9 May 2018, 7:19 pm
కాంగ్రెస్‌పై మండిపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వరంగల్ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు... కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. తర్వాత మాట్లాడిన ఆయన... పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటూ ఆ పార్టీ నేతలపై మాటల తూటాలు పేల్చారు. కేసీఆర్‌ను ఓడించడమే తమ ధ్యేయమని కొంతమంది అంటున్నారని... ఇప్పటి నుంచే కాంగ్రెస్ నేతలు ఎగిరెగిరిపడుతున్నారని విమర్శించారు. కొంతమంది గడ్డాలు కూడా తీయమంటున్నారని... గడ్డం పెంచిన ప్రతి ఒక్కరూ గబ్బర్ సింగ్‌లు కాలేరంటూ పరోక్షంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై విమర్శలు కురిపించారు.
Samayam Telugu Ktr...


రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే పదవుల్లో ఉంటామని... లేదంటే వారితోనే కలిసి పని చేస్తామన్నారు మంత్రి. ప్రజాస్వామ్యంలో బాస్ ఎవరంటే ప్రజలేనని... అదే కాంగ్రెస్ అయితే ఢిల్లీకి పోయి చేతులు కట్టుకుని నిలబడాలన్నారు. కాని తమకు మాత్రం గల్లీలో ఉండే ప్రజలే బాస్‌లని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ఆ పార్టీ నేతలకు భయం పట్టుకొందని... అందుకే తమపై విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి. కాంగ్రెస్ చెప్పే మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని... 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ రూ.లక్షలు చేస్తామని చెప్పినా ఎవరూ నమ్మలేదని గుర్తు చేశారు. 60ఏళ్లు పాలించినప్పుడు ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.