యాప్నగరం

ముందస్తు ఎన్నికలపై నాలుగు రోజుల్లో క్లారిటీ: కేటీఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయంటూ ప్రచారం ఊపందుకుంటోంది. సీఎం కేసీఆర్ నుంచి సంకేతాలు రావడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కగా.. సెప్టెంబర్ 2న జరిగే ప్రగతి నివేదిప సభలోనే దీనిపై ఓ ప్రకటన రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ముందస్తు ప్రచారంపై మంత్రి కేటీఆర్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 26 Aug 2018, 8:22 pm
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయంటూ ప్రచారం ఊపందుకుంటోంది. సీఎం కేసీఆర్ నుంచి సంకేతాలు రావడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కగా.. సెప్టెంబర్ 2న జరిగే ప్రగతి నివేదిప సభలోనే దీనిపై ఓ ప్రకటన రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ముందస్తు ప్రచారంపై మంత్రి కేటీఆర్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ దగ్గర జరగబోయే ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి మాట్లాడారు.
Samayam Telugu KTR.


ముందస్తు ఎన్నికలపై నాలుగు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పారు కేటీఆర్. తాము అధికారాన్ని వదలుకోవడానికి సిద్ధంగా ఉంటే సంతోషంగా ఉండాల్సిందిపోయి.. ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు. ప్రజల ముందుకు వెళ్లడానికి వాళ్లకు ధైర్యం చాలడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల మాటల్ని పట్టించుకోమని.. టీఆర్‌ఎస్‌ మీటింగ్‌లో డబ్బులు పంచామని ఆ పార్టీ నేతలు అనడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ మాదిరిగా తాము ప్రజల సొమ్మును దోచుకోలేదని.. వాళ్ల బాసులు ఢిల్లీలో ఉంటే.. తమ బాసులు గల్లీల్లో ఉన్నారని కేటీఆర్‌ అన్నారు.
తమది దోపిడీ సభ కాదని.. ప్రజల మనసు దోచే సభ అని చెప్పారు మంత్రి. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాలుగున్నరేళ్లలో ఏం చేశామో చెప్పేందుకే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని.. ఈ సభ దేశ చరిత్రలో నిలిచిపోదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. 100 స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కేటీఆర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.