యాప్నగరం

కోడి గుడ్డు ధరపై మంత్రి వద్ద రైతుల గోడు

పెరుగుతున్న ఫీడ్ ధరలతో నష్టపోతున్నామని తెలంగాణ పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. గుడ్డు ధరలు నిర్ణయించడానికి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

Samayam Telugu 25 Apr 2019, 11:20 pm
తెలంగాణ పౌల్ట్రీ రైతులు తమ సమస్యల గురించి మంత్రి నిరంజన్ రెడ్డి వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం (ఏప్రిల్ 25) హైదరాబాద్‌లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి వివరించారు. వాటికి పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేశారు.
Samayam Telugu egg
పౌల్ట్రీ రైతులు


అసాధారణంగా పెరుగుతున్న ఫీడ్ ఖర్చుతో ఫౌల్ట్రీల నిర్వహణ అంతకంతకూ భారమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్ రేట్లకు సమాంతర గుడ్డు రేటు పెరగకపోవడంతో నష్టపోతున్నట్లు తెలిపారు. ఒక్కో గుడ్డుపై రూపాయి వరకూ నష్టపోతున్నట్లు చెప్పారు. ఈ లెక్కన తెలంగాణ రైతులు రోజుకు రూ.3 లక్షల పైగా నష్టపోతున్నారని తెలిపారు.

ప్రభుత్వ అధ్వర్యంలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు. ప్రభుత్వ అధికారులే గుడ్డు ధరలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతుల సమస్యలను మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు మేలు జరిగేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.