యాప్నగరం

బంగారు తెలంగాణే లక్ష్యంగా బడ్జెట్

తెలంగాణ ప్రభుత్వం సోమవారం శాసనభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

TNN 13 Mar 2017, 7:52 am
తెలంగాణ ప్రభుత్వం సోమవారం శాసనభలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఉదయం 11.30గంటలకు బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని మొదట అనుకున్నా... ప్రభుత్వం తాజాగా ఆ ముహూర్తాన్ని మధ్యాహ్నం 12గంటలకు మార్చింది. శాసనసభ సచివాలయం కార్యదర్శి డాక్టర్ రాజాసదారాం ఆదివారం రాత్రి బడ్జెట్ ప్రసంగం మొదలయ్యే సమయం మారినట్టు బులెటిన్ విడుదల చేశారు.
Samayam Telugu telangana presents budget for 2017 18 today
బంగారు తెలంగాణే లక్ష్యంగా బడ్జెట్


తెలంగాణ మంత్రిమండలి ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. బంగారు తెలంగాణ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వృద్ధి రేటును పెంచేలా బడ్జెట్ ను రూపొందించినట్టు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచేలా ఉంటుందని అన్నారు. అంతేకాదు బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక... దాని గొప్పతనాన్ని చాటేలా తెరాస శ్రేణులు ప్రతి జిల్లాలో సంబరాలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు.

గతేడాది లక్షా 30 వేల కోట్లుతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. ఇప్పుడు మరో 15 శాతం పెరిగే అవకాశం ఉంది. ఈసారి లక్షా 45వేల కోట్ల నుంచి లక్షా 46 వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.