యాప్నగరం

రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

TNN 15 Apr 2017, 6:09 pm
రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశంలో అన్ని పార్టీలు ఈ మేరకు అంగీకరించాయి. రేపు ఒక్క రోజే సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ప్రధానంగా చర్చిస్తారు. ఇవాళ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినేట్.. ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన ముసాయిదాకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 3 ముసాయిదా బిల్లులకు ఈ సమావేశాల్లో ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లకు సంబంధించిన ముసాయిదా బిల్లుతో పాటు తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్ యాక్ట్‌కు శాసనసభ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు జీఎస్టీ అంశంపైనా చర్చ జరగనుంది.
Samayam Telugu telangana special assembly session on muslims and st reservations on sunday
రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం


బీఏసీ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా వచ్చారు. కానీ, ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటు కొనసాగుతోందని, బీఏసీ సమావేశాల్లో పాల్గొనడానికి సాంకేతికంగా ఆయనకు అర్హత లేదని తెలపడంతో వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత స్పీకర్ శాసనసభను సైన్ డై చేసిన సంగతి తెలిసిందే. శాసనసభను ప్రొరోగ్ చేయకపోవడం వల్ల సండ్ర సస్పెన్షన్ ఇప్పటికీ అమల్లో ఉన్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.