యాప్నగరం

మోత్కుపల్లిపై టీడీపీ బహిష్కరణ వేటు

అనుకున్నదే జరిగింది. టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లిపై బహిష్కరణ వేటు పడింది. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ విజయవాడలో జరుగుతున్న మహానాడులో ప్రకటించారు.

Samayam Telugu 28 May 2018, 7:37 pm
అనుకున్నదే జరిగింది. టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లిపై బహిష్కరణ వేటు పడింది. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ విజయవాడలో జరుగుతున్న మహానాడులో ప్రకటించారు. 'ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితం.. పార్టీని కూడా బలహీనపరిచే విధంగా ఉన్నాయి. అలాగే గత 6 నెలలుగా జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆయన చేసిన విమర్శలన్నీ కేంద్ర, రాష్ట్ర కమిటీలకు సంబంధం లేనివి, నిరాధారమైనవి' అన్నారు రమణ.
Samayam Telugu Motkupalli Out


'మోత్కుపల్లి కొంతకాలంగా విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఆయనకు గవర్నర్ పదవి కోసం చంద్రబాబు చొరవ చూపించారు. తీరా అది రాదని తెలిసి.. ఇప్పుడు గొడవ మొదలుపెట్టారు. కేసీఆర్‌ను ఎన్టీఆర్ ప్రతిరూపమని ఎలా చెబుతారు.. తెలంగాణ సీఎంకు మోకరిల్లాలని చూస్తున్నారు. మరి నేరెళ్ల బాధితుల విషయంలో మోత్కుపల్లి ఏం సమాధానం చెబుతారు. అనుభవం ఉన్న నేత ఇలా ప్రవర్తించడం దురదృష్టకరం.. ఆయన చేసిన ద్రోహానికి వెంటనే క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు రమణ.

ఇవాళ ఎన్టీఆర్ జయంతి కావడంతో.. మోత్కుపల్లి ఘాట్‌లో నివాళులర్పించి భోరున విలపించారు. తాను రాజకీయ కుట్రలకు బలయ్యానని.. తనను నమ్మించి మోసం చేశారంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై బహిష్కరణ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయంపై మోత్కుపల్లి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తే.
అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్‌పై కుట్ర రాజకీయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.