యాప్నగరం

దేశానికే పాఠాలు చెప్పేలా మన పథకాలు..

కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే పాఠాలు చెప్పేలా అభివృద్ధి పథకాలు చేపడుతోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం (ఆగస్టు 18) ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా..

TNN 18 Aug 2017, 2:59 pm
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే పాఠాలు చెప్పేలా అభివృద్ధి పథకాలు చేపడుతోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం (ఆగస్టు 18) ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం సర్దాపూర్‌లో నిర్మించిన గోదాములు, పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని మరో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులకు రూ.55000 కోట్ల రుణాలు మాఫీ చేస్తే.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్‌ ప్రభుత్వం రూ.17000 కోట్ల రుణాలను మాఫీ చేసిందని తెలిపారు. దేశానికి ధాన్యాగారంగా ఉన్న పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీని అధ్యయనం చేయడానికి అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నేతలు దీన్ని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu telangana welfare schemes become ideal for the country says ktr
దేశానికే పాఠాలు చెప్పేలా మన పథకాలు..


గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేవి కావని, విద్యుత్‌ కూడా సకాలంలో అందించలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులందరికీ సమయానికి ఎరువులు, విత్తనాలు అందుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక ఇబ్బందులను అధిగమించి.. ప్రస్తుతం 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నా.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా భూములన్నింటినీ సర్వే చేయించి ఎకరానికి రూ.8000 చొప్పున పెట్టుబడి ఇస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపిస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్, హరీష్ రావు కలిసి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.