యాప్నగరం

ఉద్యోగం కోసం అబద్దం చెప్పమన్న కలెక్టర్ ఆమ్రపాలి

కలెక్టర్ ఆమ్రపాలి నిరుద్యోగ యువతకు చేసిన సూచన వివాదాస్పదంగా మారింది.

TNN 25 May 2017, 9:38 am
వరంగల్ జిల్లాలో జరిగిన జాబ్ మేళాలో కలెక్టర్ ఆమ్రపాలి నిరుద్యోగ యువతకు చేసిన సూచన వివాదాస్పదంగా మారింది. కలెక్టర్ మాట్లాడిన మాటలకు వెంటనే డిప్యూటీ సీఎం శ్రీహరి ఖండించారు. అసలేం జరిగిందంటే... వరంగల్ లోని ములుగు రోడ్డులో జాబ్ మేళా నిర్వహించారు. దీనికి యువ కలెక్టర్ ఆమ్రపాలి, మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహ్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. నిరుద్యోగులను ఉద్దేశించి ఆమ్రపాలి మాట్లాడుతూ... ఉద్యోగం రావాలంటే ఇంటర్య్వూ సమయంలో కొన్ని అబద్ధాలాడాలని అన్నారు. మార్కులు, సర్టిఫికెట్లు వీటి విషయంలో కాదని, పనిచేసే సమర్థత విషయంలో అబద్ధాలాడాలని అన్నారు. అయిదు నిమిషాలే పనిచేసే వారైనా... రెండు గంటలు పనిచేస్తామని చెప్పాలని... ఉద్యోగం వచ్చాక చెప్పిన అబద్ధాన్నే నిజం చేయాలని అన్నారు.
Samayam Telugu tell lies in interviews to get job collector advised
ఉద్యోగం కోసం అబద్దం చెప్పమన్న కలెక్టర్ ఆమ్రపాలి


అది విన్న మంత్రులు ఒక్కసారిగా కంగుతిన్నారు. మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగం కోసం అబద్ధాలు చెప్పొద్దని, వెంటనే దొరికిపోతారని హెచ్చరించారు. తెలివైన వారు బోర్డులో ఉంటే ... వారు అబద్ధాలాడుతున్నట్టు పసిగట్టేస్తారని... వచ్చే ఉద్యోగం కూడా రాకుండా పోతుందని చెప్పారు. కేసీఆర్ సర్కార్ ఉన్నంత వరకు ఎవరూ అబద్ధాలాడి ఉద్యోగం తెచ్చుకోవాల్సి అవసరం ఉండదన్నారు. అయితే కలెక్టర్ స్థాయి ఉద్యోగి అబద్ధాలాడమని చెప్పడం సంచలనంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.