యాప్నగరం

YS Jagan మీది అజ్ఞానమా? అమాయకత్వమా? మీ నాయన కన్నం పెడితే..: లోకేశ్ సెటైర్లు

TDO నేత నారా లోకేశ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎందులో ఆదర్శమని అడిగారంటే మీది అజ్ఞానమో, అమాయకత్వమో అర్థం కావడం లేదన్నారు. మీ నాయన విద్యుత్ డిస్కంలను దివాళా తీయించారని విమర్శించారు.

Samayam Telugu 20 Jul 2019, 4:21 pm
టీడీపీ హయాంలో విద్యుత్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల విషయమై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. శుక్రవారం అసెంబ్లీలో ఈ విషయమై జగన్, చంద్రబాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యూనిట్‌ రూ.4.20 పైసలకే థర్మల్ విద్యుత్ లభిస్తుండగా.. ఒక్కో యూనిట్‌కు రూ.1.74 పైసలు ఎక్కువ ఖర్చు పెట్టి పునరుత్పాదక విద్యుత్‌ను ఎక్కువగా ఎందుకు కొనుగోలు చేశారని జగన్ చంద్రబాబు నాయుడిని నిలదీశారు. 11 శాతం పునరుత్పాదక విద్యుత్ కొంటే చాలని సీఈఆర్పీ చెబితే.. దాదాపు 24 శాతం ఎందుకు కొన్నారంటూ జగన్ నిలదీశారు. బాబు కూడా ఘాటుగా బదులిచ్చారు. ఏపీ సీఎం విమర్శలకు సోషల్ మీడియా వేదికగా నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు.
Samayam Telugu nara lokesh2


‘‘YS Jagan Mohan Reddy గారూ! ఎందులో ఆదర్శం అని చంద్రబాబుగారిని మీరు అడిగారంటే అది మీ అజ్ఞానమో, అమాయకత్వమో అర్థం కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో, దేశంలో మొదటిసారిగా విద్యుత్ సంస్కరణలను చేపట్టి నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి ఆదర్శంగా నిలిచారు చంద్రబాబుగారు.
చంద్రబాబుగారి కష్టాన్నే మీ నాయనగారు ఉచిత విద్యుత్తు అంటూ సోకు చేసుకున్నారు. అంతేకాదు 2009 ఎన్నికలకి ముందు యూనిట్ విద్యుత్తును రూ.16కి కొనిపించి డిస్కంలకు రూ.6,600 కోట్లు బకాయి పెట్టి సంస్థలను దివాళా తీయించిన ఘనత మీ నాయనగారిదే.

విద్యుత్ సంస్థలకు మీ నాయన పెట్టిన కన్నాన్ని పూడ్చేటందుకు 2015లో ఉదయ్ పథకాన్ని ఉపయోగించుకుని రూ.8,892 కోట్ల నష్టాలను సరిచేసే ప్రయత్నం చేసాం. 2015-16లో యూనిట్ రూ. 4.63కు కొన్న విద్యుత్తును 2018-19లో రూ.2.72కు కొంటున్నాం. ఇది చెప్పకుండా పాతధరల మీదే రాద్ధాంతం ఎందుకు?

అయినా విద్యుత్తును ఎక్కువ పెట్టి కొనేస్తున్నాం, ప్రజాధనం వృథా అయిపోతోంది అని సుద్దపూస కబుర్లు చెప్తున్న మీరు, కర్ణాటకలో మీ సొంత సండూర్ పవర్ సంస్థ HESCOMకు రూ. 4.50కి ఎందుకు అమ్ముతోందో చెప్తారా? అంటే మీ జేబులో వేసుకునేటప్పుడు అది ప్రజాధనం అని గుర్తుకురాదా?

థర్మల్ పవర్ ఛీప్ కదా ఎందుకు వాడుకోకూడదు అని వాదిస్తున్న మీ తెలివితేటలకు నవ్వొస్తోంది. ప్రపంచం మొత్తం క్లీన్ ఎనర్జీ వైపు మళ్ళుతోందని, 2022 నాటికి 175 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పాదకతను దేశం లక్ష్యంగా పెట్టుకుందన్న విషయం మీకు తెలియకపోవడం మా దురదృష్టం’’ అని లోకేశ్ కామెంట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.