యాప్నగరం

చంద్రబాబు కీలక నిర్ణయం, కమలంతో కటీఫ్?

జైట్లీ ప్రకటన తర్వాత చంద్రబాబు ఏపీ మంత్రులతో సమావేశమయ్యారు. అలాగే ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతా ఎన్డీయే నుంచి బయటకు రావడమే మంచిదని సూచించారు.

Samayam Telugu 8 Mar 2018, 7:06 am
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన హామీ ప్రకారం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. బీజేపీ ప్రభుత్వం ఏపీ సమస్యలను అర్థం చేసుకోకుండా, మిత్రధర్మం పాటించకపోవడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం.
Samayam Telugu picture-received-caption-provided-chandrababu-ruben-banerjee_16572ebe-1402-11e8-8db2-4ddb0f8cfdad


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వర్గంలోని టీడీపీ నేతలతో రాజీనామాలు చేయించేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే, పౌర విమానాయన శాఖ మంత్రి అశోక గజపతి రాజు అందుబాటులో లేని నేపథ్యంలో గురువారం రాజీనామాలు సమర్పించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరీ ఇప్పటికే రాజీనామాను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.

మరికొద్ది సేపటిలో చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. జైట్లీ ప్రకటన తర్వాత చంద్రబాబు ఏపీ మంత్రులతో సమావేశమయ్యారు. అలాగే ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతా ఎన్డీయే నుంచి బయటకు రావడమే మంచిదని సూచించారు. దీంతో కేంద్ర మంత్రులు రేపు రాజీనామాలు చేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.