యాప్నగరం

తెలుగు రాష్ట్రాల మధ్య ముగిసిన జల జగడం

ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన నీటి వివాదం ముగిసింది. ఈ గొడవపై కృష్ణా రివర్ బోర్డు జోక్యం చేసుకొని పరిష్కారం చూపింది. ఏపీ డిమాండ్ ప్రకారం మరో 5 రోజుల పాటూ రోజుకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

TNN 1 Mar 2018, 12:25 pm
ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన నీటి వివాదం ముగిసింది. ఈ గొడవపై కృష్ణా రివర్ బోర్డు జోక్యం చేసుకొని పరిష్కారం చూపింది. ఏపీ డిమాండ్ ప్రకారం మరో 5 రోజుల పాటూ రోజుకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం ఏర్పడింది. సాగర్ కుడి కాలువకు తెలంగాణ అధికారులు నీటిని నిలిపివేశారు.దీంతో తమ వాటా పూర్తవ్వకుండా నీటిని నిలిపివేయడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కుడి కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని ఏపీ అధికారులు డిమాండ్ చేశారు.
Samayam Telugu telugu states water war at sagar finally krishna river board solve the issue
తెలుగు రాష్ట్రాల మధ్య ముగిసిన జల జగడం


సాగర్ నుంచి ఆంధ్రకు 10.5 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు కేటాయించింది, అయితే ఇప్పటి వరకు 10.2 టీఎంసీల నీరు విడుదలవగా... మరో 0.3 టీఎంసీలు నీరు విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ నీటిని విడుదల చేయకుండానే తెలంగాణ కుడి కాల్వకు నీటిని నిలిపి వేయడం ఏంటని ఏపీ ప్రశ్నించింది. ముందు జాగ్రత్తగా డ్యామ్ దగ్గర ఇరు రాష్ట్రాల పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అయితే చివరికి కృష్ణా రివర్ బోర్డు జోక్యం చేసుకొని పరిష్కారం చూపించడంతో వివాదం సద్ధుమణిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.